Boyapati Sreenu: అఘోరాగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య.. వార్తలపై స్పష్టతనిచ్చిన బోయపాటి
- ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్
- లాక్డౌన్తో అంతరాయం
- బోయపాటి సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం
సింహా, లెజెండ్ సినిమాల తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రానున్న కొత్త సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనపడనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బోయపాటి స్పష్టతనిచ్చారు. ఆ వార్తలు నిజమేనని, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు.
ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్కు కూడా విరామం వచ్చింది. బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని బోయపాటి వ్యాఖ్యానించారు.
కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.