Jagan: ‘కరోనా’ దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండండి ..పొరుగు రాష్ట్రాలోని తెలుగు వారికి ఏపీ సీఎం జగన్ వినతి

AP CM Jagan request to Telugu people in Various States

  • వలస కూలీలకు మాత్రమే అనుమతిస్తాం
  • అందువల్ల మిగిలిన వాళ్లు రావొద్దు
  • సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దు

ఏపీలో ‘కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను విజ్ఞప్తి  చేశారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గరద్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఉందని, వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్ లో పెడుతున్నామని అన్నారు.

వైద్య పరీక్షలు చేసి, వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని, అందువల్ల మిగిలిన వారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘కరోనా’ దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని, ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని, ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు.

  • Loading...

More Telugu News