Pakistan: గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాక్ సుప్రీంకోర్టు.. మండిపడిన భారత్!

India lodges protest with Islamabad over Pak courts order on Gilgit Baltistan

  • ఎన్నికలు నిర్వహించే వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పాక్ కోర్టు
  • గిల్గిట్-బాల్టిస్థాన్ కశ్మీర్‌లో అంతర్భాగమన్న భారత్
  • ఆ దేశ రాయబారికి డిమార్ష్ లేఖ

పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీరుపై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గిల్గిట్- బాల్టిస్థాన్‌లో సెప్టెంబరులో సాధారణ ఎన్నికలు నిర్వహించాలని పాక్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడమే ఇందుకు కారణం. అంతేకాదు, అప్పటి వరకు అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్, ఆ దేశ రాయబారికి డిమార్ష్ లేఖను అందించింది. కశ్మీర్‌లోని ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది.

జమ్మూకశ్మీర్, లడఖ్‌తోపాటు గిల్గిట్- బాల్టిస్థాన్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని, అక్కడ ఎలాంటి మార్పులను భారత్ సహించబోదని స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వానికి కానీ, అక్కడి న్యాయవ్యవస్థకు కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జోక్యం చేసుకునే అధికారం లేదని పేర్కొంది. ఈ ప్రాంతంలో భౌతిక పరమైన మార్పులకు ప్రయత్నిస్తున్న పాక్ చర్యలను ఖండిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News