KCR: మనం హైదరాబాద్ ను ఎందుకు కాపాడుకోవాలంటే..!: సీఎం కేసీఆర్

CM KCR says Hyderabad have a better future

  • చైనా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయన్న సీఎం
  • వాటి చూపంతా హైదరాబాద్ పైనే ఉందని వెల్లడి
  • నగరానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని ధీమా

జనాభా రీత్యా హైదరాబాద్ నగరం ముంబయితో పోటీపడుతుందని, కానీ ముంబయిలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ధాటికి అగ్రగామి కంపెనీలు చైనా దాటి వచ్చేస్తున్నాయని, అయితే, భారత్ వైపు చూస్తున్న ఆయా కంపెనీలు హైదరాబాద్ గురించి ఆరా తీస్తున్నట్టు తెలిసిందని అన్నారు. దక్షిణాదిలో అనేక ప్రాంతాలపై ఆ సంస్థలు కన్నేసినా, ప్రధానమైన ఫోకస్ హైదరాబాద్ పైనే అని స్పష్టం చేశారు. హైదరాబాద్ కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, అందుకే మన నగరాన్ని ఎంతో సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News