Mumbai: రెండు రోజుల ముచ్చటే... ముంబైలో మద్యం దుకాణాలు మూసేయాలని నిర్ణయం!

Wineshops Closed in Mumbai After 2 Days Open

  • భౌతిక దూరాన్ని విస్మరించిన ప్రజలు
  • అన్ని షాపులనూ మూసివేయాలని అధికారుల నిర్ణయం
  • మహారాష్ట్రలో 15 వేలు దాటిన కేసుల సంఖ్య

కేంద్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరచుకునేందుకు అనుమతించగా, ముంబై వాసులకు మాత్రం అది రెండు రోజుల ముచ్చటగానే నిలిచింది.

కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం, వైన్స్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని మరవడంతో, తీవ్రంగా స్పందించిన బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు, మద్యం దుకాణాలను నేటి నుంచి తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాలు మినహా మరే ఇతర షాపులను కూడా తెరిచేందుకు వీల్లేదని ఆంక్షలు విధించారు. కాగా, ముంబైలో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 9 వేలను దాటేసింది. మొత్తం మీద రాష్ట్రంలో కేసుల సంఖ్య 15 వేలను దాటడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలను తీసుకోవాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News