Imran khan: భారత్ పై మరోమారు తీవ్ర ఆరోపణలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్

Pakistan PM allegations

  • ఎల్ఓసీ వెంబడి చొరబాట్లు అన్నవి నిరాధార ఆరోపణలు
  • భారత్ తప్పుడు అజెండాకు ఇది కొనసాగింపు
  • దక్షిణాసియాలో శాంతికి భంగం వాటిల్లుతోంది 

భారత్ పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుని భారత్ చేబడుతున్న తప్పుడు ఆపరేషన్ల విషయమై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయన్న నిరాధార ఆరోపణలే భారత్ తప్పుడు అజెండాకు కొనసాగింపు అని ఆరోపించారు. కశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లను స్థానిక అల్లర్లుగా ఆయన అభివర్ణించారు. అధికార పార్టీ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టిన ఇమ్రాన్, ఆ నిర్ణయాల వల్లే దక్షిణాసియాలో శాంతికి భంగం వాటిల్లుతోందని ఆరోపించారు.

కాగా, జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ ను మన భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భరించలేకపోతున్న పాకిస్థాన్.. భారత్ పైకి ఎదురుదాడికి దిగుతూ ఈ ఆరోపణలు గుప్పించింది. కశ్మీర్ లో అస్థిరత్వానికి పాకిస్థానే కారణమని భారత్ విమర్శించిన నేపథ్యంలోనే ఇమ్రాన్ ఈ ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News