Varla Ramaiah: గ్యాస్ లీకైన కంపెనీకి.. విశాఖ నాదే అని చెప్పుకుంటున్న వైసీపీ నాయకుడు అనుమతి ఇప్పించాడట: వర్ల రామయ్య
- గ్యాస్ లీక్ అయిన కంపెనీ ప్లాస్టిక్ సామానులు తయారు చేస్తుంది
- అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలకే ఇప్పుడు అనుమతి ఉంది
- ఈ కంపెనీకి అనుమతి ఎలా వచ్చింది?
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం రాజకీయరంగు పులుముకుంటోంది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతను టార్గెట్ చేస్తూ టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అరోపణలు గుప్పించారు. 'గ్యాస్ లీక్ అయిన కంపెనీ దక్షిణ కొరియా దేశానికి చెందినది. ఆ కంపెనీలో ప్లాస్టిక్ సామానులు తయారు చేస్తారు. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలకు మాత్రమే ఇప్పుడు అనుమతి ఉంది. ప్లాస్టిక్ సామానులు ఇప్పటికిప్పుడు అత్యవసరం కాదు. అలాంటప్పుడు ఈ కంపెనీకి అనుమతి ఎలా వచ్చింది. విశాఖ నాది అని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకుడే ఈ కంపెనీకి అనుమతి ఇప్పించారట. ఇదీసంగతి! ' అని ట్వీట్ చేశారు.