America: అమెరికాలో అమాంతం ఎగబాకిన నిరుద్యోగిత
- మార్చిలో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత
- ఏప్రిల్ లో ఏకంగా 14.7 శాతానికి ఎగబాకిన వైనం
- ఒక్క ఏప్రిల్‌లోనే 2 కోట్ల మంది ఉద్యోగాలు ఫట్
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పోయి వీధినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 2 కోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఫలితంగా మార్చిలో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో ఏకంగా 14.7 శాతానికి పెరిగింది.
మరోవైపు, 50 లక్షల మంది ఉద్యోగుల పనిగంటలను ఆయా సంస్థలు గణనీయంగా తగ్గించేయడంతో అది వీరి ఆదాయంపై ప్రభావం చూపనుంది. అలాగే, దేశంలో నిరుద్యోగ భృతి కోసం 3.3 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మాంద్యం తర్వాత సాధించిన ఉద్యోగ వృద్ధి అంతా కరోనా కారణంగా ఒక్క నెలలోనే బూడిదలో కలిసిపోయిందని ఫ్యాక్ట్ చెక్ సర్వే పేర్కొంది.