Heart: గుండెను సైతం దెబ్బతీస్తున్న కరోనా మహమ్మారి!

Corona virus causes heart failure

  • కరోనాతో శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం
  • హృదయ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నట్టు గుర్తింపు
  • గుండె కండరాలకు ఇన్ఫెక్షన్ వస్తోందంటున్న అధ్యయనాలు

సాధారణంగా కరోనా వైరస్ సోకితే న్యూమోనియా ఏర్పడుతుందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా హార్ట్ అటాక్ కు గురవుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ఈ మహమ్మారి వైరస్ గుండెను కూడా దెబ్బతీస్తోందని గుర్తించారు. కేరళలో కరోనా కారణంగా సంభవించిన మొదటి మరణంలోనూ హార్ట్ ఫెయిల్యూర్ జరిగినట్టు వైద్యులు తెలుసుకున్నారు.

కరోనా సోకితే శ్వాససంబంధ సమస్యలు ఏర్పడడం అనేది ప్రాథమిక లక్షణం. కానీ, కరోనా మరణాలు పెరిగే కొద్దీ ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. గతంలో హృదయ సంబంధ సమస్యలు ఉన్నా, లేకపోయినా... కరోనా సోకిన తర్వాత వారిలో గుండె పనితీరు కూడా ప్రభావితమవుతోందని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా గుండె కండరాలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ కరోనా ఇదే తరహాలో దెబ్బతీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిలో 45 నుంచి 55 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్, ఆపై మయో కార్డైటైటిస్ సమస్యలు ఏర్పడినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ తరహా గుండె సమస్యలు వచ్చిన కరోనా రోగుల్లో 3 శాతం మందే బతికి బట్టకడుతున్నారట.

  • Loading...

More Telugu News