Fish Medicine: చేప ప్రసాదం పంపిణీ లేదు: బత్తిని సోదరుల కీలక ప్రకటన

No Fish Medicine this Year

  • కరోనా కారణంగా మందు తయారు చేయడం లేదు
  • ఈ సంవత్సరం ఎవరూ హైదరాబాద్ రావద్దు
  • మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బత్తిని

లాక్ డౌన్, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు ప్రకటించారు. ప్రతియేటా మృగశిర కార్తె ప్రవేశించగానే, వేలాదిగా ఉబ్బస రోగులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని మీడియాకు ఓ ప్రకటన ద్వారా బత్తిని హరినాథ్ గౌడ్ తెలియజేశారు.
 
 చేప ప్రసాదం ఉందని చెప్పినా, ఎవరైనా ఆన్ లైన్ లో పంపుతామన్నా నమ్మవద్దని, అసలు తాము ఈ ఏడాది ప్రసాదాన్ని తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరూ చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దని వారు కోరారు. ఈ నెల 29తో తెలంగాణలో లాక్ డౌన్ ముగిసినా, తాము ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని, ఎవరైనా తమ పేరిట పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News