New Delhi: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగే రైళ్ల వివరాలు!

Trains From Tomorrow that Runs in Telugu States

  • న్యూఢిల్లీ నుంచి వివిధ నగరాల మధ్య రైళ్లు
  • 15 గమ్యస్థానాలకు రైళ్లు నడపనున్న అధికారులు
  • నేటి సాయంత్రం నుంచి ఆన్ లైన్ రిజర్వేషన్

సుమారు 50 రోజుల తరువాత రేపటి నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసిన రైల్వే శాఖ, బుకింగ్ కౌంటర్స్ వద్ద టికెట్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.

హౌరా - న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - జమ్మూతావి, బెంగళూరు - న్యూఢిల్లీ, తిరువనంతపురం - న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ, బిలాస్ పూర్ - న్యూఢిల్లీ, రాంచీ - న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ - న్యూఢిల్లీ, అగర్తలా - న్యూఢిల్లీ, భువనేశ్వర్ - న్యూఢిల్లీ, మడ్ గావ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.

ఇక రేపటి నుంచి తిరిగే రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలను పరిశీలిస్తే...

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.

  • Loading...

More Telugu News