Uttar Pradesh: లాక్డౌన్ ఉల్లంఘనల్లో యూపీ టాప్.. 50 రోజుల్లో 43 వేల మందిపై కేసు
- జరిమానాగా రూ. 17.34 కోట్లు వసూలు
- 36.5 లక్షలకుపైగా వాహనాల తనిఖీ
- 38,950 వాహనాలు స్వాధీనం
లాక్డౌన్ ఉల్లంఘనల కేసుల్లో ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. గత 50 రోజుల్లో ఏకంగా 43 వేల మంది లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. వీరందరిపైనా కేసులు నమోదు చేసి రూ. 17.34 కోట్లను జరిమానాగా వసూలు చేసినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థి తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా అవనీశ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 43,028 కేసులు నమోదైనట్టు చెప్పారు. అలాగే, 36.5 లక్షలకు పైగా వాహనాలను తనిఖీ చేశామని, నిబంధనలు పాటించని 38,950 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.