Dil Raju: శ్రీమతితో దిల్ రాజు తొలి సెల్ఫీ... వైరలో వైరల్!

dil Raju First Selfy With Second Wife

  • ఆదివారం రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు
  • చూడచక్కని జంటంటూ నెటిజన్ల కామెంట్లు
  • సామాజిక మాధ్యమాల్లో తొలి సెల్ఫీ చక్కర్లు

గత ఆదివారం రాత్రి నిజామాబాద్ కు సమీపంలోని నర్సింగ్ పల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, తన భార్యతో తొలిసారిగా ఓ సెల్ఫీని దిగారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఇద్దరూ చూడచక్కని జంటగా ఉన్నారని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.

కాగా, దిల్ రాజు వివాహమాడిన యువతి ఎవరన్న విషయమై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆమె పేరు తేజస్విని అని, బ్రాహ్మణ యువతని కొందరు అంటుండగా, మరికొందరు ఆమె పేరు వైఘా రెడ్డి అని, దిల్ రాజు కుటుంబానికి దగ్గరి వ్యక్తేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ను దిల్ రాజే తీర్చాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News