Corona Virus: ఏపీలో గత 24 గంటల్లో 9,256 శాంపిళ్ల పరీక్ష.. మొత్తం 2,100కి చేరిన కేసులు
- గత 24 గంటల్లో మరో 36 మందికి కరోనా
- అదే సమయంలో 50 మంది డిశ్చార్జ్
- మొత్తం కేసుల సంఖ్య 2,100
- ఆసుపత్రుల్లో 860 మందికి చికిత్స
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,256 శాంపిళ్లను పరీక్షించగా మరో 36 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 50 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,100గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,192 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 9, గుంటూరులో 5, కడప, కృష్ణా జిల్లాల్లో 2 చొప్పున, నెల్లూరులో 15, శ్రీకాకుళంలో 2 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది.
జిల్లాల వారిగా కేసుల వివరాలు..