Mekathoti Sucharitha: డైనమిక్ విధానంలో బిల్లుల రీడింగ్ తీయడం వల్ల ప్రజలకే ప్రయోజనం: ఏపీ హోం మంత్రి సుచరిత

Home minister sucharitha statement

  • విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నది అపోహ
  • ఏప్రిల్  బిల్లుల రీడింగ్ కు డైనమిక్ విధానం పాటిస్తున్నారు
  • జూన్ 30 నాటికి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు 

ఏపీలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న విమర్శలపై రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఇవన్నీ అపోహలని, విద్యుత్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే రీడింగ్ తీయడం జరుగుతోందని అన్నారు. విద్యుత్ శాఖాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

అనంతరం, సుచరిత మాట్లాడుతూ, విద్యుత్ బిల్లులు పారదర్శకంగా వస్తున్నాయని అన్నారు. మార్చి నెలలో విద్యుత్ బిల్లులను గత ఏడాది టారిఫ్ ప్రకారం తీస్తున్నారని, ఏప్రిల్ నెల బిల్లుల రీడింగ్ ను డైనమిక్ విధానం ద్వారా తీస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విధానం ప్రకారం వినియోగదారులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని అన్నారు. శ్లాబ్ విధానం కాకుండా డైనమిక్ విధానంలో బిల్లుల రీడింగ్ తీయడం వల్ల ప్రజలకు లాభం చేకూరుతుందని తెలిపారు. జూన్ 30 నాటికి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News