Botsa Satyanarayana: ‘ఎల్జీ పాలిమర్స్’ గోడ చుట్టూ ఉన్న వాటిని ప్రభావిత గ్రామాలుగా ప్రకటించాలని అక్కడి వారు కోరారు: మంత్రి బొత్స

Minister Botsa Pressmeet

  • ప్రతి వ్యక్తికీ రూ.10 వేలు ఇవ్వాలని వారు కోరారు
  • ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం
  • రేపటితో ఎన్యుమరేషన్ పూర్తవుతుంది

గ్యాస్ లీకేజ్ ఘటనలో ఐదు గ్రామాలనే ప్రభావిత గ్రామాలుగా గుర్తించారని, ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గోడ చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 విశాఖపట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం ప్రకటించిన రూ.10 వేలును ప్రతి వ్యక్తికీ ఇవ్వాలని ఆ గ్రామాల ప్రజలు కోరారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రేపటితో ఎన్యుమరేషన్ పూర్తవుతుందని, ఈ ఐదు గ్రామాలతో పాటు ఏయే గ్రామాలకు సాయం అందించాలనే దానిపై నివేదిక పూర్తవుతుందని అన్నారు.

ఈ నివేదికను మంత్రులు, అధికారులు పరిశీలించిన అనంతరం ఆ వివరాలను ప్రకటిస్తామని, రేపు లేదా ఎల్లుండి లోపు వాళ్లందరికీ సీఎం చేతుల మీదుగా సాయం అందిస్తామని వివరించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలికమైన ప్రణాళిక  రూపొందించామని, భవిష్యత్తులో కూడా ఏవిధమైన ఆరోగ్య సమస్య తలెత్తినా పూర్తి బాధ్యత వహించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News