Package: వ్యవసాయం కోసం రూ. లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి: నిర్మలా సీతారామన్

Centre announces huge package for agri sector

  • మరో ప్యాకేజి ప్రకటించిన కేంద్రం
  • ఈసారి రైతులకు ఊరట కలిగించేలా ప్యాకేజి
  • రూ.లక్ష కోట్లతో వ్యవసాయ రంగ మౌలిక వసతుల కల్పన

ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ఇప్పటికే రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల రైతులకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు వెల్లడించారు.

ప్యాకేజి వివరాలు...

  • రైతుల కోసం లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన
  • వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు స్వల్పకాలిక రుణాలు
  • వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోడౌన్లు, కోల్డ్ స్టోరేజిల నిర్మాణం
  • గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి
  • ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు
  • రొయ్యసాగు, చేపల వేటకు రూ.11 వేల కోట్లు
  • ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులకు రూ.9 వేల కోట్లు
  • వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళిక
  • మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి ఉపాధి
  • లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యం
  • చేపల వేటపై నిషేధం అమలులో ఉన్న సమయంలో వ్యక్తిగత బీమాతో పాటు పడవలకు సైతం బీమా
  • గడువు తీరిన 242 ఆక్వా హేచరీలకు మరో 3 నెలల గడువు పొడిగింపు
  • పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు
  • పశువులు, గేదెలు, మేకలు, పందులు, గొర్రెలకు 100 శాతం వ్యాక్సినేషన్
  • పశు సంవర్ధక శాఖ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
  • పాల ఉత్పత్తి కేంద్రాల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
  • సహకార రంగాల్లోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ
  • ఔషధ మొక్కల సాగుకు రూ.4 వేల కోట్లు
  • దేశవ్యాప్తంగా 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కల సాగు
  • వచ్చే రెండేళ్లలో మరో లక్ష హెక్టార్లకు విస్తరణ
  • దీనివల్ల రైతులకు అదనంగా రూ.5 వేల కోట్ల ఆదాయం
  • పీఎం కిసాన్ సమ్మాన్ కింద రూ.73,400 కోట్ల విలువైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు
  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రైతులకు రూ.18,700 కోట్లు బదిలీ
  • గడచిన రెండు నెలల్లో ఫసల్ బీమా యోజన కింద పరిహారం రూపంలో రూ.6,400 కోట్లు 
  • ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 వేల కోట్లు

  • Loading...

More Telugu News