KCR: హైదరాబాదులోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు: సీఎం కేసీఆర్

CM KCR reviews corona situation in Telangana

  • కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • లాక్ డౌన్ యథావిధిగా అమలు చేయాలని స్పష్టీకరణ
  • కేంద్రం మార్గదర్శకాల అనంతరం రాష్ట్ర వ్యూహం ఖరారు

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు, కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో కరోనా కేసుల్లేవని అన్నారు. ఎల్బీ నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ ప్రాంతాల్లోనే యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను యథావిధిగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 17న కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని చెప్పారు.

కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పలు దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విమానాల ద్వారా వచ్చే తెలంగాణ వాసులకు, రైళ్ల ద్వారా వచ్చే వలస కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, వైరస్ ఉంటే ఆసుపత్రికి, లేకపోతే హోం క్వారంటైన్ లో ఉంచాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News