Nikhil: ఆనందం పట్టలేక అద్భుతంగా డ్యాన్స్ చేసిన హీరో నిఖిల్... వెడ్డింగ్ మూమెంట్స్ వీడియో!

Hero Nikhil Wedding Movements

  • 14న పల్లవితో నిఖిల్ వివాహం
  • పెళ్లికి అందరినీ పిలవాలని భావించాను
  • ఈ వీడియో చూసి ఆశీర్వదించండి
  • ఇన్ స్టాగ్రామ్ లో నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కు ఇటీవల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న పల్లవీ వర్మ అనే యువతితో స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య హైదరాబాద్ లోని ఓ రిసార్టులో ఈ వివాహం జరిగింది. తన వెడ్డింగ్ మూమెంట్స్ వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఈ వీడియోలో నిఖిల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను ఆకట్టుకున్నాయి. "నా వివాహానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలని భావించాను. ప్రస్తుత కొవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఈ వీడియోను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను. మీ ఆశీస్సులు నాకు కావాలి. నాకు ఎంతో ఇష్టమైన పాట ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది" అని నిఖిల్ వ్యాఖ్యానించాడు. నిఖిల్ పెళ్లి దృశ్యాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News