Pawan Kalyan: టీటీడీ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలి: పవన్ కల్యాణ్
- 14 వేల మంది చాలీ చాలని జీతాలతో బతుకుతున్నారు
- టైమ్ స్కేల్ అమలు చేయాలని దశాబ్ద కాలంగా కోరుతున్నారు
- ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయండి
రెండు దశాబ్దాలుగా టీటీడీలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే టైమ్ స్కేల్ ను అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 14 వేల మంది ఉద్యోగులు స్వామి వారిని నమ్ముకుని చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టైమ్ స్కేల్ అమలు చేయాలని దశాబ్ద కాలంగా వీరు కోరుతున్నారని చెప్పారు.
ఉద్యోగ భద్రత లేని జీవితాలు గడుపుతున్న ఉద్యోగులను... ఇప్పుడు టీటీడీ తీసుకున్న నిర్ణయం మరింత క్షోభకు గురి చేస్తోందని అన్నారు. ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.