rana: సంప్రదాయ దుస్తుల్లో రానా, మిహీకా ఫొటోలు.. 'ఇట్స్‌ అఫిషియల్' అంటూ రానా ట్వీట్!

rana engagement

  • నిశ్చితార్థం జరిగిందా?
  • పంచెకట్టులో రానా
  • చీరకట్టులో మిహీకా

మిహీకాతో తన సంబంధాన్ని ఇటీవల వెల్లడించిన సినీనటుడు రానా తాజాగా, 'అండ్ ఇట్స్ అఫిషియల్' అంటూ రెండు ఫొటోలు పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. రామానాయుడు స్టూడియోలో నిన్న సాయంత్రం  4 గంటలకు మిహీకా బజాజ్, రానాల నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుందని నిన్న ఉదయం వార్తలు వచ్చాయి. అయితే, మర్యాదపూర్వకంగానే ఇరు కుటుంబాలు కలుస్తాయని ఆ వెంటనే రానా తండ్రి సురేశ్ బాబు వివరణ ఇచ్చారు. తాజాగా, రానా పోస్టు చేసిన ఫొటోల్లో ఆయన పంచెకట్టులో, మిహీకా పట్టుచీరలో కనపడ్డారు.
                        
ఈ రోజు రానా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే వారి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ స‌భ్యులు కొద్ది మంది మధ్య ఈ వేడుక జరిగినట్లు టాక్. కాగా, వారి పెళ్లి డిసెంబ‌ర్‌లో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సురేశ్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News