Chidambaram: కేంద్రం, ఐసీఎంఆర్ చెబుతున్న కరోనా లెక్కల్లో తేడా వస్తోంది: చిదంబరం
- 1.18 లక్షల కరోనా కేసులున్నాయంటున్న కేంద్రం
- డ్యాష్ బోర్డులో మాత్రం 1.16 లక్షల కేసులే చూపిస్తున్న వైనం
- ఇదేం విచిత్రం అంటూ ట్వీట్ చేసిన చిదంబరం
కేంద్రం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలకు, ఐసీఎంఆర్ వెల్లడిస్తున్న కరోనా కేసుల సంఖ్యకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆరోపించారు.
"దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447 అని, ఆసుపత్రుల్లో 66,330 మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 3,583 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెబుతోంది. కానీ, ఐసీఎంఆర్, ఎంహెచ్ఎఫ్ డబ్ల్యూ గణాంకాల ఆధారంగా నడుస్తున్న డ్యాష్ బోర్టులో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,723గా దర్శనమిస్తోంది. చాలా విచిత్రంగా అనిపిస్తోంది" అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.
ఇదే కాదు, అనేక రాష్ట్రాలు వెల్లడిస్తున్న కరోనా గణంకాలకు, కేంద్ర గణాంకాలకు మధ్య తేడా ఉందని ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి.