China: గూఢచర్యానికి పాల్పడుతున్నాయట.. 30 చైనా కంపెనీలకు అమెరికా షాక్!
- ఉగర్లపై చైనా అణచివేత ధోరణిపై అమెరికా మండిపాటు
- చైనా మిలటరీతో సంబంధాలున్నాయంటూ బ్లాక్ లిస్ట్
- చైనా అణచివేత కార్యక్రమంలో ఈ కంపెనీలకు భాగం ఉందన్న అమెరికా
చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించింది.
చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి ఇవి పాల్పడుతున్నాయని పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.