COVID-19: లాక్‌డౌన్ మళ్లీ పొడిగించారో.. ఇక ఆర్థిక వినాశనం తప్పదు: ఆనంద్ మహీంద్రా

There will be no use if Lockdown Extends says Anand Mahindra

  • పొడిగింపు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు
  • వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉంది
  • కోవిడ్ యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరోమారు కనుక పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. అంతేకాదు, లాక్‌డౌన్ పొడిగింపు వల్ల వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు.

మరోమారు లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొడుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన ట్వీట్లను ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కోవిడ్‌యేతర రోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉందంటూ గతంలో ఆయన చేసిన ట్వీట్లను గుర్తు చేశారు. లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆనంద్ మహీంద్రా గతంలోనూ పేర్కొన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్‌డౌన్ ఎత్తివేయడమే మేలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News