Roja: రోజా అనుమతి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- ముదురుతున్న ప్రొటోకాల్ వివాదం
- రోజాకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకోలేదని నారాయణస్వామి ఎద్దేవా
- అక్కడ ఓ కల్యాణమంటపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం
చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య చెలరేగిన వివాదం ముదురుతోంది. తనను పిలవకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ నారాయణస్వామిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యాఖ్యలకు ఆయన కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు.
పుత్తూరులో పర్యటించేందుకు తనకు రోజా అనుమతి అవసరం లేదని నారాయణస్వామి చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా తాము మీటింగ్ పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం గిరిజన యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారని... సంఘం తరపున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ ఒక కల్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని... జిల్లా కలెక్టర్ తిరుపతికి వెళ్తూ.... పుత్తూరుకు వచ్చి స్థలాన్ని పరిశీలించారని చెప్పారు.