TTD: ఇకపై ఆన్ లైన్లో తిరుమల లడ్డూలు!
- లాక్ డౌన్ కారణంగా భక్తులకు దూరమైన శ్రీవారి దర్శనం
- స్వామివారి లడ్డూలను భక్తులకు అందుబాటులోకి తెచ్చిన టీటీడీ
- లడ్డూల కోసం ఎగబడుతున్న భక్తులు
లాక్ డౌన్ కారణంగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం దూరమైంది. అయితే, భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలను మాత్రం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణమంటపాల్లో లడ్డూల విక్రయాన్ని ప్రారంభించింది. రూ. 25కే రాయితీ లడ్డూలను విక్రయిస్తోంది. తొలి రోజు మూడు గంటల్లోనే 2.40 లక్షల లడ్డూలు అమ్మడుపోయాయి. లడ్డూల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక ఆర్డర్ పై స్వామి వారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా పంపిణీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. వీటిని ఆన్ లైన్లో విక్రయిస్తామని తెలిపింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వ్యక్తులు... లడ్డూలను సమీపంలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణమంటపాల నుంచి తీసుకోవాలని చెప్పింది. శ్రీవారి దర్శనం పునఃప్రారంభమయ్యేంత వరకు సబ్సిడీ ధరలపై లడ్డులను విక్రయిస్తామని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.