Madhya Pradesh: డీజే సౌండ్, సైరన్ మోతలు.. పారిపోతోన్న మిడతలు.. వీడియోలు ఇవిగో!
- ఇటీవల మధ్యప్రదేశ్లోకి ప్రవేశించిన మిడతలు
- పలు పద్ధతుల్లో తరిమికొడుతోన్న రైతులు
- ఫలిస్తోన్న అధికారులు, రైతుల ప్రయత్నాలు
రాజస్థాన్లో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ప్రవేశించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా తీసిన మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. మిడతల దాడి మొదలైన ప్రాంతాల్లో కొందరు డీజే సౌండు పెట్టి వాటిని బెదరగొట్టి వెనక్కి పంపించేశారు. పన్నాలో జిల్లా పరిపాలన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సైరెన్లు మోగించి మిడతలను తరిమికొట్టారు.
అధికారులు, రైతులు చేస్తోన్న ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. భారీ శబ్దాలకు ఆ మిడతలు తోక ముడుస్తున్నాయి. సైరెన్ మోగించిన వీడియోను యూపీలోని ఝాన్సీ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్వీట్ చేశారు. మిడతలను తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద శబ్దాలు కూడా చేయొచ్చన్నారు.