KCR: చినజీయర్ స్వామితో కలిసి అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR starts pump house motors along with Chinna Jeeyar Swamy

  • కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలు
  • మర్కుక్ పంప్ హౌస్ మోటార్లు ప్రారంభం
  • గోదావరి నదికి హారతి ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ నీటి పారుదల రంగంలో మరో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. గోదావరి జలాలు సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మర్కుక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామితో కలిసి మోటార్లు ప్రారంభించగా, పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతల విధానంలో జలజలా ముందుకు ఉరికాయి.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గోదావరి నదీమాతకు జలహారతి ఇచ్చారు. కాగా, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుతో ఐదు జిల్లాలకు జల వనరులు సమకూరనున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం దీని సొంతం. ఈ ప్రాజెక్టుతో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి సైతం తాగు నీరు సరఫరా చేయొచ్చు.

  • Loading...

More Telugu News