Donald Trump: సోషల్ మీడియా సైట్లను టార్గెట్ చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్

Trump issues executive orders to shorten legal protection of social media sites
  • యూజర్ల కంటెంట్ ను తనిఖీ చేస్తే సైట్లపై చర్యలకు వీలు
  • ఇటీవల ట్రంప్ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేసిన ట్విట్టర్ యాజమాన్యం
  • ఆగమేఘాలపై ఉత్తర్వులు తీసుకువచ్చిన ట్రంప్
  • సోషల్ మీడియా సైట్ల న్యాయపరమైన అవకాశాలకు కత్తెర
ఇటీవల తాను చేసిన ట్వీట్ పై ట్విట్టర్ యాజమాన్యం ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. దాని పర్యవసానంగా, సోషల్ మీడియా సైట్లకు కళ్లెం వేస్తూ వాటి న్యాయపరమైన రక్షణను మరింత కుదించేలా తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.

ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లకు ఇది వర్తించనుంది. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ఫలితంగా.... సోషల్ మీడియా సైట్లు ఆన్ లైన్ లో యూజర్ల కంటెంట్ ను తనిఖీ చేస్తే అమెరికా విచారణ సంస్థలు చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కాగా, ఉత్తర్వులు వెలువరించే ముందు ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. "భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఓ విపత్తు నుంచి రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వివరించారు.
Donald Trump
Executive Order
Social Media
Twitter
Facebook
Youtube

More Telugu News