Corona Virus: ఇక పది నిమిషాల్లోనే కరోనా ఉందో.. లేదో చెప్పేస్తారు!
- కనిపెట్టిన యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్
- బంగారు నానో రేణువులతో పదార్థం
- వైరస్ ఉంటే రంగు మారే విధానం
వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఉందో, లేదో అనే విషయాన్ని అతి తక్కువ సమయంలో వెల్లడించే పరిక్షా విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇందులో భాగంగా కేవలం పది నిమిషాల్లో వైరస్ ఉనికిని కనిపెట్టే అవకాశాలుంటాయి. యూఎస్ లోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ సైటిస్టులు దీన్ని ఆవిష్కరించారు. ఇందులో అత్యంత సూక్ష్మమైన బంగారు నానో రేణువులతో కూడిన పదార్థాన్ని వినియోగించారు. అనుమానితుని నుంచి సేకరించిన నమూనాలో కరోనా ఉంటే ఈ పదార్థం రంగు మారుతుంది. పదార్థం రంగు మారితే కరోనా సోకినట్టుగా నిర్ధారణ అవుతుంది.