Botsa Satyanarayana: న్యాయస్థానాల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది: హైకోర్టు తీర్పుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

botsa on high court verdict

  • కోర్టు తీర్పునకు వక్రభాష్యాలు సరికాదనే ఏజీ చెప్పారు
  • మమల్ని తిరస్కరిస్తారో, లేక గెలిపిస్తారో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం
  • విద్యత్‌ ఛార్జీలు విధించే విధానంలోనే తాము మార్పులు చేశాం
  •  పేద ప్రజల విద్యుత్‌ బిల్లులపై భారం వేయలేదు

ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదంటూ వస్తోన్న విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. న్యాయ స్థానాల పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.

కోర్టు తీర్పునకు వక్రభాష్యాలు సరికాదనే ఏజీ చెప్పారని అన్నారు. తమను తిరస్కరిస్తారో, లేక గెలిపిస్తారో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని తెలిపారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపుపై వస్తోన్న విమర్శల పట్ల కూడా ఆయన స్పందించారు. విద్యుత్‌ ఛార్జీలు విధించే విధానంలోనే తాము మార్పులు చేశామని చెప్పారు. పేద ప్రజల విద్యుత్‌ బిల్లులపై భారం వేయలేదని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News