Andhra Pradesh: సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ మరో కీలక అడుగు... నేటి నుంచి మరో 13 శాతం షాపుల రద్దు!

Another 13 Percent Wine Shops closed in AP from Today

  • 3,500 నుంచి 2,965కు చేరిన వైన్స్ షాపులు
  • ఏడాది వ్యవధిలో తగ్గిన 33 శాతం షాపులు
  • వచ్చే నాలుగేళ్లలో మద్యం లేకుండా చేస్తామంటున్న ప్రభుత్వం

సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తెస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు, మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి మరో 535 మద్యం షాపులు కనుమరుగు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది.

వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, ఏడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని జగన్ చెబుతున్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News