Nisarga: అరేబియా సముద్రంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం... జాగ్రత్తగా ఉండాలన్న ప్రధాని మోదీ

Deep depression in Arabian sea turned into cyclonic storm Nisarga

  • అరేబియా సముద్రంలో నిసర్గ
  • రేపు ముంబయి సమీపంలో తీరం దాటే అవకాశం!
  • భారీగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నం తుపానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీనికి నిసర్గ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుపాను ముంబయికి దక్షిణ నైరుతి దిశగా 380 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో నిసర్గ తీవ్ర తుపానుగా బలపడి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం వద్ద భూభాగంపైకి ప్రవేశిస్తుందని ఐఎండీ వెల్లడించింది.

ముంబయి సమీపంలో తీరం చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. దాంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఇప్పటికే 32 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యాయి.  ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News