nagababu: చైనా వస్తువుల్ని, యాప్స్‌ను బహిష్కరిద్దాం: నాగబాబు పిలుపు
- మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చైనా చూస్తోంది
- మన దేశంలో తయారైన వస్తువులని కొందాం
- ప్రపంచంలో మన దేశం పెద్ద మార్కెట్
- మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది
చైనా వస్తువులను, యాప్స్‌ను భారత్‌లో అధికంగా వాడుతుండడంపై జనసేన నేత నాగబాబు స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
'చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్‌లను నిషేధించాలి. మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువుల్ని, సెల్ ఫోన్ యాప్స్ ను బహిష్కరిద్దాం. మన దేశంలో తయారైన వస్తువులని కొందాం. ప్రపంచంలో మన దేశం పెద్ద మార్కెట్. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు' అని నాగబాబు అన్నారు.
'అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది. తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం బాగుపడతాం. మన డబ్బు మన దేశంలోనే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కానీ మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవాలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దాం' అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.