Cricket: ఏనుగును చంపిన ఘటనపై ఆవేదన‌ వ్యక్తం చేసిన భారత క్రికెటర్లు

cricketers on elephant death

  • మనుషులు క్రూరులన్న రోహిత్
  • మనం ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదని వ్యాఖ్య
  • సిగ్గుమాలిన చర్యన్న సురేశ్‌ రైనా

కేరళలో కొందరు ఏనుగును చంపేసిన ఘటనపై భారత క్రికెటర్‌ రోహిత్‌శర్మ మండిపడ్డాడు. మనుషులు క్రూరులని, మనం ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఏనుగును చంపిన ఘటన గురించి తెలుసుకున్నాక తన హృదయం ద్రవించిందని, ఏ జంతువు కూడా అలాంటి క్రూరత్వానికి బలికాకూడదని అన్నాడు.

కాగా, ఏనుగును చంపిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా సురేశ్‌ రైనా అభివర్ణించాడు. మూగజీవుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నాడు. ఏనుగును చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. టీమిండియా కెప్టెన్‌ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏనుగు మృతికి కారణమైన వాళ్లు రాక్షసులని భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏనుగును చంపిన ఘటనపై దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News