Delhi: మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం!
- ఢిల్లీలోకి ప్రవేశించే రహదారుల ఓపెన్
- మద్యంపై కరోనా స్పెషల్ ఫీజ్ ఎత్తివేత
- ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన కేజ్రీవాల్
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం లాకౌ డౌన్ ఆంక్షలను తీవ్ర తరం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోకి ప్రవేశించే రహదారులన్నింటినీ మూసివేయించింది. తాజాగా ఈరోజు నుంచి ఆంక్షలను సడలిస్తున్నారు. ఈరోజు నుంచి సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. అయితే, ప్రజలు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని... వైరస్ విస్తరించేందుకు తోడ్పడే విధంగా ప్రవర్తించకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
మరోవైపు మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో మద్యంపై కరోనా స్పెషల్ ఫీజులు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఫీజులు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని విన్నవించారు. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.