Andhra Pradesh: 10 రోజుల్లో రేషన్ కార్డులు... 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు.. ఏపీ సర్కారు నిర్ణయం
- అర్హులకు సత్వరమే సేవలు
- దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు
- కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు సత్వరమే అందేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందిస్తామని, దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ప్రజాసంక్షేమంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొత్తం 541 రకాల సేవలు అందనున్నట్టు తెలుస్తోంది.