Sensex: అమ్మకాల ఒత్తిడితో చివరి గంటలో కుప్పకూలిన మార్కెట్లు
- ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు
- 413 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 120 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లు చివరి గంటలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో, సెన్సెక్స్ ఇంట్రాడేలో హైయ్యెస్ట్ పాయింట్ నుంచి దాదాపు 900 పాయింట్లు కోల్పోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 33,956కి పడిపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు కోల్పోయి 10,046కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.67%), సన్ ఫార్మా (1.90%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.57%), ఏసియన్ పెయింట్స్ (0.39%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-3.80%), భారతి ఎయిర్ టెల్ (-3.12%), యాక్సిస్ బ్యాంక్ (-3.07%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.05%), టైటాన్ కంపెనీ (-2.78%).