Tamil Nadu: జన్మదినం రోజే కరోనాతో కన్నుమూసిన డీఎంకే ఎమ్మెల్యే.. మహమ్మారికి బలైన తొలి ఎమ్మెల్యే!
- కరుణానిధి, స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు
- సినీ పరిశ్రమతోనూ సన్నిహిత సంబంధాలు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పళనిస్వామి
తమిళనాడును కమ్మేసిన కరోనా మహమ్మారి డీఎంకే ఎమ్మెల్యేను బలితీసుకుంది. చేప్పాక్కం ఎమ్మెల్యే అన్బగళన్ (62) ఈ ఉదయం కరోనాతో కన్నుమూశారు. దివంగత కరుణానిధి, డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన అన్బగళన్ 2001, 2011, 2016లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించారు. నటుడు జయం రవితో ‘ఆదిభగవాన్’ అనే సినిమా నిర్మించారు. కరోనాతో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఇదే తొలిసారి. నేడు ఆయన పుట్టిన రోజు. బర్త్‌డే నాడే ఆయన కరోనాతో కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, అన్బుగళన్ మృతికి ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు సంతాపం తెలిపారు.