Sensex: నష్టాల నుంచి మళ్లీ లాభాల బాట పట్టిన మార్కెట్లు!
- 290 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 70 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 10 శాతం వరకు ఎగబాకిన ఇండస్ ఇండ్ బ్యాంక్
నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయినప్పటికీ... చివరకు లాభాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 290 పాయింట్లు లాభపడి 34,247 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 10,116 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.93%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.27%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.17%), యాక్సిస్ బ్యాంక్ (1.88%).
టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-3.92%), బజాజ్ ఆటో (-2.58%), టాటా స్టీల్ (-2.44%), ఓఎన్జీసీ (-2.00%), టైటాన్ కంపెనీ (-1.90%).