Sabarimala: 14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం... 19 నుంచి వార్షికోత్సవాలు

Sabarimala Ayyappa temple set to reopen from June 14th
  • వర్చువల్ క్యూ పద్ధతిలో నమోదు చేసుకున్న వారికే అనుమతి
  • పంబ, సన్నిధానం వద్ద స్క్రీనింగ్
  • తేదీలను వాయిదా వేయాలంటూ ప్రధానార్చకుడి లేఖ
మరో మూడు రోజుల్లో శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ నెల 14న ఆలయాన్ని తెరిచి నెలవారీ పూజలు నిర్వహిస్తామని, 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతిలో నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అది కూడా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించుకున్నదై ఉండాలని స్పష్టం చేశారు. భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. వీరికి పంప, సన్నిధానం వద్ద స్క్రీనింగ్ నిర్వహిస్తామని వివరించారు.

కాగా, కరోనా నేపథ్యంలో ఈ తేదీలను వాయిదా వేయాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు బోర్డుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే, అలాంటి లేఖ ఏదీ తమకు అందలేదని, అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ తేదీలను నిర్ణయించినట్టు బోర్డు అధ్యక్షుడు వాసు తెలిపారు.
Sabarimala
Lord Ayyappa Swami Temple
COVID-19

More Telugu News