Rahul Gandhi: ఈ ప్రశ్నలు సోషల్ మీడియా ద్వారా మాత్రం అడగొద్దు: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి సలహా

Ravishanker Prasad Sujetion to Rajul Gandhi

  • అంతర్జాతీయ సమస్యలపై ట్విట్టర్ లో ప్రశ్నలు వద్దు
  • మీరే స్వయంగా తెలుసుకోండి
  • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

చైనా, ఇండియాల మధ్య ఇటీవలి కాలంలో సరిహద్దు సమస్యలు, విభేదాలు పెరిగిపోయిన వేళ, ప్రధాని సైలెంట్ గా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నిత్యమూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తుండగా, కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, వాటిని తిప్పికొట్టారు. అంతర్జాతీయ అంశాలు, గోప్యత నెలకొన్న ఈ తరహా అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఇకపై ప్రశ్నలు వేయవద్దని ఆయన సలహా ఇచ్చారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంటర్నేషనల్ ఇష్యూలపై సోషల్ మీడియాలో ఏమీ అడగవద్దన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. గతంలో బాలాకోట్ దాడులపైనా, ఊరీ దాడులపైనా ఆధారాలను రాహుల్ అడిగారని గుర్తు చేశారు. కాగా, లడఖ్ ప్రాంతంలో చైనా, సరిహద్దులను దాటి భారత భూ భాగాన్ని ఆక్రమించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, మోదీ మౌనంగా ఉంటూ, తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని రాహుల్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News