Ayyanna Patrudu: న్యాయస్థానాలు వరుసగా ఇస్తున్న తీర్పులు ప్రజలకు ధైర్యాన్నిస్తున్నాయి: అయ్యన్నపాత్రుడు
- ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలంటూ అయ్యన్న ఆరోపణలు
- పోలీసుల సహా వ్యవస్థలన్నీ కళ్లు మూసుకున్నాయని విమర్శలు
- సీఎం జగన్ నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజా పరిమాణాలపై స్పందించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయని విమర్శించారు.
అయితే, ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు ప్రజల్లో ధైర్యాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏడాదిలో 70 సార్లు ఓ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడం ఇదే తొలిసారని ఎద్దేవా చేశారు. నైతిక బాధ్యతతో సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.