America: 20 ఏళ్ల కరోనా రోగికి విజయవంతంగా ఊపిరితిత్తులు మార్చిన వైద్యులు!

Indian Origin Doctor Performs 1st Lung Transplant In US

  • అమెరికాలో అరుదైన ఆపరేషన్
  • భారత సంతతి వైద్యుడి ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల మార్పిడి
  • తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయవచ్చన్న డాక్టర్ అంకిత్ భరత్

కరోనా వైరస్‌ బారినపడిన ఓ యువతి రెండు ఊపిరితిత్తులు పాడైపోగా, వైద్యులు రెండింటినీ విజయవంతంగా మార్చారు. అమెరికాలోని షికాగోలో జరిగిందీ ఘటన. ఇక్కడి నార్త్‌వెస్టర్న్ మెడిసిన్‌ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువతి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన వైద్యులు వాటిని మార్చాలని నిర్ణయించారు.

భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కరోనా రోగికి అమెరికాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. కరోనా బాధితుల్లో అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ తెలిపారు. తప్పని పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు శస్త్రచికిత్స నిర్వహించవచ్చన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News