India: చైనా, నేపాల్‌తో పరిస్థితులపై భారత ఆర్మీ చీఫ్ వివరణ
- చైనాతో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి
- చైనాతో అగ్రశ్రేణి కమాండర్లు చర్చించారు
- నేపాల్‌తోనూ మనకు బలమైన సంబంధాలు ఉన్నాయి
- జమ్మూకశ్మీర్‌లో 15 రోజుల్లో 15 మంది ఉగ్రవాదుల హతం
లడఖ్‌లో చైనాతో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ విషయంపై ఇరు దేశ అగ్రశ్రేణి కమాండర్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీనిపై భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... చైనాతో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు చెప్పారు. చైనాతో అగ్రశ్రేణి కమాండర్లు చర్చించారని, ఈ చర్చలను కొనసాగించడం వల్ల సమస్య సద్దుమణిగే అవకాశం ఉందని అన్నారు.
ఇక నేపాల్‌తోనూ మనకు బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన అంశాల్లో లోతైన సంబంధాలున్నాయన్నారు. భవిష్యత్తులోనూ నేపాల్‌తో బలమైన బంధం కొనసాగిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో గత 15 రోజుల్లోనే సుమారు 15 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించారు. ఉగ్రవాదంతో స్థానికులు కూడా విసిగిపోయారని, వారే భద్రతా బలగాలకు ఉగ్రవాదుల విషయంలో సమాచారం ఇస్తున్నారని ఆయన వివరించారు.