aakash chopra: ఆఫ్రిదికి కరోనా సోకడంపై ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తోన్న నెటిజన్లు.. మండిపడ్డ భారత మాజీ క్రికెటర్
- గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిది
- వాటిని గుర్తు చేస్తూ ఆఫ్రిదిపై నెటిజన్ల ట్వీట్లు
- ఇప్పుడు వాటిని పక్కకు పెట్టాలన్న ఆకాశ్ చోప్రా
- కరోనా నుంచి ఆఫ్రిది కోలుకోవాలని ట్వీట్
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై నెటిజన్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఫ్రిది ఇంతకుముందు భారత్‌పై చాలా సార్లు విపరీత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయనకు కరోనా సోకిన వేళ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఆఫ్రిది ఎన్నో పాపాలు చేశారని, అందుకే చివరకు కరోనా సోకిందని అంటున్నారు. ఆయనకు తగిన శిక్ష పడిందని అంటున్నారు. ఆయనపై ఎన్నో మీమ్స్, వీడియోలు పోస్టు చేస్తున్నారు.
దీంతో నెటిజన్లపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. ఇటువంటి సున్నితమైన అంశాలపై నెటిజన్లు స్పందిస్తోన్న తీరు సరికాదని ఆయన అన్నాడు. మానవత్వంతో వ్యవహరించాలని సూచించాడు. గతంలో ఆఫ్రిదీ ఏం చేశాడన్న విషయాన్ని ఇప్పుడు పక్కకు పెట్టాలని చెప్పాడు. ఆఫ్రిది త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు.