Petrol: వరుసగా తొమ్మిదో రోజు... పెరిగిన 'పెట్రో' ధరలు!
- పెట్రోలుపై 48 పైసల ధర పెంపు
- 64 పైసల వరకూ పెరిగిన డీజిల్ ధర
- హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 78.67కు
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. ఈ ఉదయం 6 గంటలకు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెట్రోలు ధర 48 నుంచి 62 పైసల మేరకు పెరుగగా, డీజిల్ ధర 53 నుంచి 64 పైసల వరకూ పెరిగింది.
మారిన ధరలను బట్టి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 75.78, చెన్నైలో రూ. 79.53, ముంబయిలో రూ. 82.70కి పెరుగగా, ఇవే నగరాల్లో డీజిల్ ధర వరుసగా రూ. 74.03, రూ. 72.18, రూ. 72.64కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 78.67కు, విశాఖపట్నంలో రూ. 77.47కు చేరుకోగా, లీటరు డీజిల్ ధర విశాఖపట్నంలో రూ. 71.25కు చేరుకుంది.