Karan Johar: సుశాంత్!.. ఇంకెప్పుడూ ఇలా చేయను: కరణ్ జొహార్ భావోద్వేగం

Karan Johar Emotional Post on Sushant singh Death
  • ఏడాదిగా టచ్ లో లేను
  • ఓ స్నేహితుడి ఓదార్పు అతనికి అవసరం
  • ఆ విషయాన్ని గుర్తించి కూడా లోతుగా వెళ్లలేకపోయాను
  •  సుశాంత్ వి కల్మషం లేని నవ్వులు 
గత కొంతకాలంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో తాను టచ్ లో లేనని, ఇది తనకెంతో బాధను కలిగిస్తోందని బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జొహార్ భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఆయన మరణం తనకు ఓ పెద్ద మేలు కొలుపని అభివర్ణించాడు. అతనికి ఓ స్నేహితుడు అవసరమన్న సంగతిని గుర్తించానని, అంతకన్నా లోతుగా వెళ్లలేకపోయినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని, ఇకపై తన జీవితంలో ఎన్నడూ ఇలా చేయబోనని అన్నారు.

ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన కరణ్ జొహార్, తనను తాను నిందించుకున్నారు. మనుషుల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ వి కల్మషం లేని నవ్వులని, ఆయన ఆత్మీయ ఆలింగనాలను తాను ఇప్పుడు కోల్పోయానని అన్నారు. కాగా, కరణ్ నిర్మించిన 'డ్రైవ్'లో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే.
Karan Johar
Sushant Singh Rajput
Social Media

More Telugu News