Ishwarya Rajesh: చావబోనని అభిమాని నుంచి ఒట్టేయించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్!

Ishwarya Rajesh Reply to Fan Goes Viral
  • పలు దక్షిణాది భాషల్లో నటిస్తున్న ఐశ్వర్య
  • ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటించిన వైనం 
  • నీ కోసం చావడానికైనా సిద్ధమని చెప్పిన ఫ్యాన్ కు దీటైన జవాబు
కోలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించి, ఆపై అన్ని దక్షిణాది భాషల్లో అవకాశాలను సంపాదించుకుని, ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేశ్, ఇటీవల గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమేనంటూ, తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ, అభిమానులకు మరింత దగ్గరైంది. ఈ నేపథ్యంలో, తాజాగా, ఫ్యాన్స్ తో మాట్లాడుతున్న వేళ, ఓ అభిమాని చెప్పిన మాటలతో అవాక్కైన ఆమె వెంటనే స్పందించి, అతనికి సరైన సమాధానం ఇచ్చింది.

ఓ ఫ్యాన్ ఆమెకు ట్వీట్ చేస్తూ, "మీ నటన చాలా బాగుంటుంది. మీరంటే నాకు ఎంతో అభిమానం. మీ కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాడు. దీంతో తొలుత షాక్ కు గురైన ఆమె, ఆపై తేరుకుని, జీవితం అన్నది అర్థాంతరంగా చావడానికి కాదని హితవు పలికింది. ఆపై ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడబోనని, అతన్నుంచి ఒట్టేయించుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న ఇతర అభిమానులు, ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.
Ishwarya Rajesh
Fans
Social Media

More Telugu News