Sensex: చైనాలో మళ్లీ కరోనా కేసులు... భారీ నష్టాల్లో ముగిసిన మన మార్కెట్లు!
- చైనాలో మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు
- ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు
- 552 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దీనికి తోడు చైనాలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్లు పతనమై 33,228కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 9,813 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.22%), సన్ ఫార్మా (1.18%), ఓఎన్జీసీ (0.18%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-4.55%), బజాజ్ ఫైనాన్స్ (-4.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.88%), ఎన్టీపీసీ (-3.87%), టాటా స్టీల్ (-3.61%).